Narendra Modi: భారత్- సింగపూర్ బంధం చాలా కీలకం : వాంగ్

సింగపూర్‌తో భారత్ సంబంధాలు కేవలం దౌత్యపరమైనవి కావని అంతకు మించినవని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. భారత పర్యటనకు వచ్చిన సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ (Lawrence Wang) మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమ దేశాల మధ్య ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించుకోవాలని ఇరు దేశాల నేతలు నిర్ణయించుకున్నారు. కృత్రిమ మేధ, క్వాంటమ్ కంప్యూటింగ్, ఇతర డిజిటల్ సాంకేతిక రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలన్న ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. పహల్గాం దాడి సందర్భంగా భారత్ (India)కు మద్దతు తెలిపిన సింగపూర్ (Singapore) ను మోదీ కొనియాడారు. ఉగ్రవాదంపై అన్ని దేశాలు ఏకం కావాలని, కలిసకట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో భారత్-సింగపూర్ బంధం చాలా కీలకమని వాంగ్ తెలిపారు. విమానయానం, నైపుణ్యాభివృద్ది, గ్రీన్ డిజిటల్ షిప్పింగ్, స్పేస్ అండ్ డిజిటల్ ఇన్నోవేషన్, భవిష్యత్ తరం ఆర్థిక మౌలిక సదుపాయాల కల్పన రంగాల్లో ఇరు దేశాలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. మోదీ, వాంగ్‌లు జేఎన్‌పోర్ట్, పీఎస్‌ఏ టెర్నికల్ రెండో దశను వర్చువల్‌గా ప్రారంభించారు.