Modi:భారత్-ఈయూ వాణిజ్య ఒప్పందం ..ఈ ఏడాది చివరి నాటికి : మోదీ

డిసెంబరులోగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని భారత్, యూరోపియన్ యూనియన్లు నిశ్చయించాయి. వాణిజ్యానికి సంబంధించినంతవరకూ నిబంధనలతో నడిచే ప్రపంచ వాణిజ్య వ్యవస్థను నిర్మించుకుందామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) , యూరోపియన్ యూనియన్ అగ్రనేతలు పేర్కొన్నారు. అమెరికా అనుసరిస్తున్న ఇష్టారాజ్యపు వాణిజ్య విధానాల నేపథ్యంలో మోదీ తదితర ప్రపంచ నేతలు తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియా కోస్టా(Antonia Costa) , యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్ (Ursula von der Leyen) లతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన టెలిఫోన్ సంభాషణల సందర్భంగా ఈ విషయాలు చర్చకు వచ్చాయి. ఉక్రెయిన్(Ukraine) రష్యా వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించడానికి భారత్ కట్టుబడి ఉందని ప్రధాని ఈ సందర్భంగా అన్నారు. భారత్‌పై అమెరికా 50 శాతం ప్రతీకారాత్మక సుంకాలు విధించిన నేపథ్యంలో మోదీ యూరోపియన్ నాయకులతో జరిపిన ఈ చర్చలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.