Donald Trump: చైనా కుట్రతోనే భారత్, రష్యాలకు దూరమయ్యాం : డొనాల్డ్ ట్రంప్

భారత్, రష్యాలను అమెరికా కోల్పోయిందని, అవి రెండూ చైనా చీకటి వలయంలో చిక్కుకున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పేర్కొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi), చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ (Jinping) , రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) ఇటీవల చైనాలో కలిసినప్పుడు మిత్రుల మాదిరిగా ముచ్చటించుకున్న విషయం తెలిసిందే. అమెరికా తీరును వారు తప్పుబట్టారు. దీనిపై ట్రంప్ స్పందించారు. చీకటి చైనాకు భారత్, రష్యా సన్నిహితం అవుతున్నాయంటూ అక్కసు వెళ్లగక్కారు. బీజింగ్‌లో చైనా ఆయుధ పాటవ ప్రదర్శనను ట్రంప్ ప్రస్తావిస్తూ రష్యా, ఉత్తర కొరియాలతో కలిసి చైనా తమపై కుట్రపన్నుతున్నట్లు ఉందని అన్నారు. చైనా అధ్యక్షుడు షీ ఆ దేశ ప్రజలు గపప్పొ వేడుక చేసుకోవాలి. అమెరికాపై మీరు (జిన్‌పింగ్) కుట్ర పన్నుతున్న సందర్భంగా పుతిన్, కిమ్‌లకు ట్రంప్ హార్ధిక శుభాకాంక్షలు తెలిపారు.