Modi: సింగపూర్ ప్రధానితో మోడీ భేటీ.. కీలక ఒప్పందాలపై సంతకాలు!

సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌తో న్యూఢిల్లీ వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరుదేశాలు కలిసి ఉగ్రవాదంపై పోరాడుతున్నాయని మోడీ (PM Modi) చెప్పారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఒక రోడ్‌మ్యాప్‌ను ఈ ఇద్దరు నేతలు విడుదల చేశారు. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న అనిశ్చితిని ఎదుర్కోవడానికి భారత్-సింగపూర్ సంబంధాలు బలోపేతం కావడం చాలా అవసరమని లారెన్స్ వాంగ్ నొక్కిచెప్పారు. దీనిపై స్పందించిన ప్రధాని మోదీ (PM Modi).. ఉగ్రవాదంపై ఉమ్మడిగా పోరాడటం మానవత్వంపై నమ్మకమున్న ప్రతి దేశం బాధ్యత అన్నారు. పరస్పర విలువలు, ప్రయోజనాలు, శాంతి, సుసంపన్నత తదితన అంశాల్లో ఉమ్మడి దార్శనికత ఆధారంగానే భారత్, సింగపూర్ దేశాల సంబంధాలు ఏర్పడ్డాయని మోడీ (PM Modi) పేర్కొన్నారు. ఈ సమావేశంలో భారత్-సింగపూర్ మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. ఇందులో భాగంగా, డిజిటల్ అసెట్ ఇన్నోవేషన్‌పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), సింగపూర్ మానిటరీ అథారిటీ మధ్య ఒప్పందం జరిగింది.