రామాయణ మ్యూజియం నిర్మాణానికి అనుమతి
అయోధ్యలో రామాయణ మ్యూజియం నిర్మాణానికి సీఎం యోగి ఆదిత్యనాథ్ అనుమతులిచ్చారు. అంతేకాక మ్యూజియం నిర్మాణం కోసం 20 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రామాయణ సర్క్యూట్లో భాగంగానే ఈ మ్యూజియం నిర్మాణం చేపట్టనున్నారు. రూ. 151 కోట్ల ఖర్చుతో దీనిని నిర్మించనున్నారు. కాగా అయోధ్య వివాదాన్ని కోర్టు బయటే పరిష్కరించుకోవాలంటూ సర్వోన్నత న్యాయస్థానం సూచించడాన్ని ఆదిత్యనాథ్ స్వాగతించారు.
