హైదరాబాద్ టు కడప ట్రూజెట్ సేవలు
ట్రూజెట్ కొత్తగా ఏప్రిల్ 27 నుంచి హైదరాబాద్ -కడప, హైదరాబాద్ నాందేడ్, నాందేడ్ -ముంబయి సెక్టార్లలో విమానాలు నడపనుంది. కేంద్ర పౌర విమానయాన శాఖ ఉడాన్‌లో కార్యక్రమంలో భాగంగా ఈ ప్రాంతాలకు తమ సేవలను విస్తరిస్తునట్లు ట్రూజెట్ తెలిపింది. ఈ సెక్టార్లలో సేవలందిస్తున్న ఏకైక విమానయాన సంస్థ తమదేనని ట్రూజెట్ ప్రమోటరైన్ టర్బో మెఘా ఎయిర్వేసి మేనేజింగ్ డైరెక్టర్ వంకాయలపాటి ఉమేశ్ పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి కడపకు ప్రతిరోజు ఉదయం 10.40కి కడప నుంచి హైదరాబాద్ మధ్యాహ్నం 12.10కి విమానం ఉంటుంది. హైదరాబాద్ నుంచి నాందేడ్‌కు ప్రతిరోజూ ఉదయం 9.25కి, నాందేడ్ నుంచి హైదరాబాద్‌కు మధ్యాహ్నం 2.30కి విమాన సేవలు ఉంటాయి. నాందేడ్ నుంచి ముంబయికి ఉదయం 10.45కి, ముంబయి నుంచి నాందేడ్‌కు మధ్యాహ్నం 12.45కి విమానం తిరుగుతుందని ట్రూజెట్ పేర్కొంది.
