Singareni workers : సింగరేణి కార్మికులకు శుభవార్త

దసరా (Dussehra) సందర్భంగా సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం బోనస్ ప్రకటించింది. లాభాల్లో 34 శాతం కార్మికులకు పంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలిపారు. ఒక్కో కార్మికుడికి బోనస్‌గా రూ.1,95,610 ఇవ్వనున్నట్లు వెల్లడిరచారు. హైదరాబాద్‌లో పలువురు మంత్రులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ మేరకు వెల్లడిరచారు. కాంట్రాక్ట్ కార్మికులకూ రూ.5,500 చొప్పున బోనస్ చెల్లిస్తామని భట్టి తెలిపారు. దీంతో 30 వేల మందికి ప్రయోజనం కలుగుతుందన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్ ఇవ్వడం దేశ చరిత్రలోనే తొలిసారిని తెలిపారు.