Donald Trump: నోబెల్ ఇవ్వలేదు.. అందుకే గ్రీన్లాండ్పై పడ్డా: ట్రంప్ షాకింగ్ లేఖ!
గ్రీన్లాండ్ (Greenland) స్వాధీనం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేస్తున్న హడావిడి వెనుక అసలు కారణం బయటపడింది. తనకు ‘నోబెల్ శాంతి బహుమతి’ దక్కలేదన్న అక్కసుతోనే తాను ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు నార్వే ప్రధాని జోనాస్ గార్ స్టోర్కు రాసిన లేఖలో ఆయన పరోక్షంగా అంగీకరించారు. “ప్రపంచవ్యాప్తంగా 8 యుద్ధాలను ఆపినా, మీ ప్రభుత్వం నాకు నోబెల్ ఇవ్వకూడదని నిర్ణయించుకుంది. అందుకే ఇకపై శాంతి గురించి ఆలోచించడం అనవసరమని భావిస్తున్నా. ఇప్పుడు నాకు అమెరికా ప్రయోజనాలే పరమావధి” అని ట్రంప్ (Donald Trump) తన లేఖలో కుండబద్దలు కొట్టారు. ఈ కారణం చూపుతూనే గ్రీన్లాండ్ స్వాధీనాన్ని సమర్థించుకున్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
గ్రీన్లాండ్పై డెన్మార్క్ హక్కులను ప్రశ్నిస్తూ.. “రష్యా, చైనాల నుండి గ్రీన్లాండ్ను డెన్మార్క్ కాపాడలేదు. వందల ఏళ్ల క్రితం ఒక పడవ అక్కడ ఆగినంత మాత్రాన అది వారి సొంతం అయిపోతుందా? అక్కడ వారి యాజమాన్య హక్కులకు సంబంధించిన పత్రాలేవీ లేవు కదా” అని వింత వాదనను తెరపైకి తెచ్చారు. వాస్తవానికి నోబెల్ ఎంపికలో నార్వే ప్రభుత్వ ప్రమేయం ఉండదు. కానీ గ్రీన్లాండ్ విషయంలో తనను విమర్శించిన నార్వే, ఫిన్లాండ్ ప్రధానులకు బదులిస్తూ ట్రంప్ (Donald Trump) ఈ లేఖ రాయడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.






