Minister Seethakka: సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు పెద్దపీట వేశారు : మంత్రి సీతక్క

మహిళలు మహారాణులుగా ఉండాలనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క (Seethakka) అన్నారు. హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం (Kotla Vijayabhaskar Reddy Stadium) లో జరిగిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ గతంలో డబ్బుల కోసం మగవారిపై ఆధారపడే పరిస్థితి ఉండేది. మహిళలు ఆర్థికంగా బలపడేలా ప్రభుత్వం ప్రత్యేక పథకాలు తీసుకువచ్చింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం. మహిళలకు కుట్టుమిషన్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌లు ఏర్పాటు చేశాం. గ్రామీణ ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ మహిళా సంఘాలకు అప్పగించాం. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మహిళలకు పెద్దపీట వేశారు. ఉచిత బస్సు సౌకర్యం అందిస్తుంటే, బీఆర్‌ఎస్ ఈ పథకాన్ని అగౌరవపరుస్తూ మహిళలపై విమర్శలు చేస్తోంది అని అన్నారు.