Revanth Reddy: గుజరాత్‌లోని సబర్మతీ తీరంలా… మూసీ తీరాన్ని : సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఢల్లీిలో నిర్వహించిన ఓ సదస్సులో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి (Revanth Reddy) మాట్లాడుతూ 2047 నాటికి తెలంగాణ ప్రాధాన్యత రంగాలను వివరించారు. రాష్ట్ర సుస్థిరాభివృద్ధికి ప్రైవేటు రంగం మద్దతు గురించి తెలిపారు. అభివృద్ధి కోసం తెలంగాణ రైజింగ్ 2047 రూపొందించుకున్నట్లు తెలిపారు. హైదరాబాద్ (Hyderabad) లో కోటి మందికి పైగా ప్రజలు నివసిస్తున్నారు. నగరంలో ఆర్ఆర్ఆర్ (RRR) కూడా నిర్మిస్తున్నాం. ప్రస్తుతం 70 కిలోమీటర్లు ఉన్న మెట్రోను 150 కిలోమీటర్లకు విస్తరిస్తున్నాం. మెట్రోలో ప్రస్తుతం రోజుకు 5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. వచ్చే ఐదేళ్లలో ఆ సంఖ్యను 15 లక్షలకు పెంచాలనేదే మా లక్ష్యం. గుజరాత్‌లోని సబర్మతీ తీరంలా మూసీ తీరాన్ని అభివృద్ధి చేస్తాం. దీనికోసం మూసీ రివర్‌ఫ్రంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. కాలుష్య కారక పరిశ్రమలను హైదరాబాద్ వెలుపలకు తరలిస్తున్నాం. ఎలక్ట్రిక్ వాహనానలు ప్రోత్సహిస్తున్నామన్నారు.
ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి ప్యూచర్సిటీని నిర్మిస్తున్నాం. విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీకి కనెక్టివిటీ ఏర్పాటు చేస్తాం. హైదరాబాద్- బెంగళూరు మధ్య బుల్లెట్ రైలు (Bullet train) ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహిస్తాం. డ్రగ్స్ (Drugs) కట్టడిలో మా రాష్ట్ర పోలీసులు దేశంలోనే నెంబర్ వన్‌గా ఉన్నారు. 2034 కల్లా ట్రిలియన్ డాలర్ల, 2047 కల్లా మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మారాలనేది మా లక్ష్యం. దేశ డీజీపీలో 10 తెలంగాణ నుంచే రావాలనేది మా ధ్యేయం అని అన్నారు.






