తెలంగాణలో వారిని విడిచిపెట్టేది లేదు : మోదీ

ప్రపంచంలో అతిపెద్ద ఎన్నికల పండగ ప్రారంభమైందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జగిత్యాలలో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభలో మోదీ పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ప్రజలు సరికొత్త చరిత్రను లిఖించబోతున్నారని పేర్కొన్నారు. దేశం అభివృద్ధి చెందితేనే తెలంగాణ కూడా అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రంలో బీజేపీకి ప్రజల మద్దతు పెరిగింది. రాష్ట్ర అభివృద్ధి కోసం రూ.2 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. మూడు రోజుల్లో తెలంగాణకు రావడం ఇది రెండోసారి. రాష్ట్రంలో బీజేపీ పెరుగుతోంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ తగ్గుతున్నాయి. రానున్న ఎన్నికల్లో మా పార్టీకి దేశవ్యాప్తంగా 400లకు పైగా సీట్లు రావడం ఖాయం. నేను భారతమాత పూజారిని. తెలంగాణ ఆంగ్లేయులు, రజాకార్లతో పోరాడిన నేల. ఇక్కడి ప్రజలను బీఆర్‌ఎస్ దోచుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్రాన్ని తన ఏటీఎంగా మార్చుకుంది. ఒక దోపిడీదారు, మరో దోపిడీదారుపై పోరాడలేరని ప్రజలకు తెలుసు. బీఆర్‌ఎస్ దోపిడిపై కాంగ్రెస్ మౌనం వహిస్తోంది. తెలంగాణ డబ్బు ఇప్పుడు ఢల్లీి చేరుతోందన్నారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండూ మోదీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయి. తెలంగాణను దోచుకున్న వారిని మేం విడిచిపెట్టేది లేదు. కుటుంబ పార్టీలు దేశాన్ని దోచుకునేందుకే రాజకీయాలు చేస్తాయి. దేశంలో ఏ దోపిడీని పరిశీలించినా దాని వెనుక కుటుంబ పార్టీలే ఉన్నాయి. 2జీ స్పెక్ట్రమ్ కేసులో డీఎంకే పేరు బయటకు వచ్చింది. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పేరు ఉంది. ఇప్పుడు అలాంటి పార్టీ జాబితాలో బీఆర్‌ఎస్ చేరింది. ఆ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టులో, ఢల్లీి మద్యం వ్యవహారంలో అవినీతికి పాల్పడిరది అని ఆరోపించారు.