Ramamurthy Naidu:రామ్మూర్తినాయుడి స్మృతివనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) సోదరుడు, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తినాయుడి (Ramamurthy Naidu) సంవత్సరీకం తిరుపతి జిల్లా నారావారిపల్లెలో జరిగింది. చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి(Bhuvaneshwari) , కుమారుడు, మంత్రి లోకేశ్(Lokesh) , సోదరి హైమావతి పాల్గొన్నారు. చంద్రబాబు దంపతులు రామ్మూర్తినాయుడి కుమారులు గిరీష్, రోహిత్‌లతో ఈ కార్యక్రమాన్ని జరిపించారు. అనంతరం తల్లిదండ్రులు అమ్మణ్ణమ్మ, ఖర్జూరనాయుడి సమాధుల వద్ద నివాళులర్పించారు. ఆ పక్కనే ఏర్పాటు చేసిన రామ్మూర్తినాయుడి స్మృతివనాన్ని ప్రారంభించారు. ఆయనకు పర్యావరణంపై మక్కువ ఉన్నందున అక్కడ పక్షుల దాహార్తి తీర్చేలా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమాలు ముగిశాక చంద్రబాబు, లోకేశ్ హెలికాప్టర్‌లో ఉండవల్లికి, భువనేశ్వరి విమానంలో హైదరాబాద్‌కు పయనమయ్యారు.