Sergio Gor: డొనాల్డ్ ట్రంప్ వీరవిధేయుడికి సెనెట్ ఆమోదం

భారత్‌లో అమెరికా నూతన రాయబారిగా సెర్గియో గోర్ (Sergio Gor) ను నియమిస్తున్నట్లు ఇటీవల అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నియామకానికి తాజాగా సెనెట్ ఆమోద ముద్ర పడిరది. ఆయన భారత్‌లోనే గాకుండా దక్షిణ, మధ్య ఆసియాకు ప్రత్యేక రాయబారిగా విధులు నిర్వహించనున్నారు. ప్రస్తుతం యూఎస్ ప్రభుత్వం షట్‌డౌన్ (Shutdown) ను ఎదుర్కొంటోన్న తరుణంలో సెనెట్ నుంచి ఈ ఆమోదం లభించింది. ఇంతకాలం వైట్‌హౌస్‌లో పర్సనల్ డైరెక్టర్‌గా కొనసాగిన 38 ఏళ్ల సెర్గియో డొనాల్డ్ ట్రంప్‌నకు వీర విధేయుడు. అందుకే అతితక్కువ కాలంలోనే ఆయన ట్రంప్ పరిపాలన విభాగంలో స్థానం సంపాదించగలిగారు.