High Court: హైకోర్టును ఆశ్రయించిన తీన్మార్ మల్లన్న

తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna) తెలంగాణ హైకోర్టు (High Court) ను ఆశ్రయించారు. రాజకీయ పార్టీ గుర్తింపు, గుర్తుపై హైకోర్టులో మల్లన్న పిటిషన్ (Petition) దాఖలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలు కల్పించాలని పిటిషనర్ నవీన్ కోరారు. ఈ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ అభ్యర్థనను పరిశీలించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘాని (State Election Commission) కి హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. కాగా, తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు, రాజ్యాధికారం లక్ష్యంగా ఇటీవల తెలంగాణ రాజ్యాధికార పార్టీని తీన్మార్ మల్లన్న స్థాపించిన విషయం తెలిసిందే.