Peddi: కొత్త షెడ్యూల్ కు ముస్తాబవుతున్న పెద్ది

రామ్ చరణ్(ram charan) హీరోగా తెరకెక్కుతున్న సినిమా పెద్ది(peddi). నేషనల్ అవార్డు గ్రహీత బుచ్చిబాబు సాన(buchibabu sana) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన పోస్టర్లు ఆడియన్స్ కు సినిమాపై భారీ అంచనాలను కలిగించాయి. విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ మూవీని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు బుచ్చిబాబు.
పెద్ది విషయంలో బుచ్చిబాబు ఎక్కడా కాంప్రమైజ్ అవడం లేదని, పర్ఫెక్షన్ కోసం చాలా జాగ్రత్త పడుతున్నాడని యూనిట్ సభ్యులు చెప్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తవుతోంది. ఆల్రెడీ పలు షెడ్యూల్స్ ను పూర్తి చేసిన చిత్ర యూనిట్, ఇప్పుడు కొత్త షెడ్యూల్ కు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. అక్టోబర్ 9 నుంచి పెద్ది కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానున్నట్టు సమాచారం.
ఈ కొత్త షెడ్యూల్ వారం రోజుల పాటూ ఉంటుందని, ఈ షెడ్యూల్ లో మూవీలోని కొన్ని కీలక అంశాలను బుచ్చిబాబు తెరకెక్కించనున్నాడని తెలుస్తోంది. జాన్వీ కపూర్(janhvi kapoor) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు(jagapathi babu), దివ్యేందు శర్మ(divyendhu sharma), శివ రాజ్‌కుమార్(siva rajkumar) కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్(AR Rahman) సంగీతం అందిస్తున్న పెద్ది సినిమా వచ్చే ఏడాది మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.