Naga Chaitanya: యంగ్ డైరెక్టర్ తో చైతూ 25వ సినిమా?
అక్కినేని నాగచైతన్య(akkineni naga chaitanya) ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సక్సెస్ తనకు తండేల్ సినిమాతో దక్కింది. తండేల్(Thandel) కు ముందు చైతన్య ఎన్నో గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొన్నాడు. కానీ తండేల్ సక్సెస్ తనను ఊపిరి పీల్చుకునేలా చేసింది. తండేల్ విజయం ఇచ్చిన జోష్ లో తన 24(NC24)వ సినిమాను కార్తీక్ దండు(Karthik Dandu) డైరెక్షన్ లో చైతన్య మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.
మిస్టిక్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుండగా, ఈ సినిమా తర్వాత చైతన్య తన కెరీర్లో ల్యాండ్ మార్క్ మూవీ అయిన 25వ సినిమాను చేయనున్నాడు. అయితే ఈ ల్యాండ్ మార్క్ మూవీకి కొరటాల శివ(Koratala Siva) లేదా బోయపాటి శ్రీను(Boyapati Srinu) లాంటి డైరెక్టర్లు దర్శకత్వం వహిస్తారని అక్కినేని ఫ్యాన్స్ అంతా భావించారు.
కానీ చైతన్య మాత్రం అందరి ఆలోచనలకు భిన్నంగా తన ల్యాండ్ మార్క్ మూవీని ఓ యంగ్ డైరెక్టర్ తో చేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. రీసెంట్ గా చైతన్యకు బెదురులంక 2012(Bedurulanka2012) డైరెక్టర్ క్లాక్స్(Clax) ఓ కథను చెప్పగా, ఆ కథ నచ్చి చైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, దీంతో చైతన్య తన ల్యాండ్ మార్క్ మూవీ అయిన 25వ సినిమాను క్లాక్స్ దర్శకత్వంలోనే చేయనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఏ మేరకు నిజముందనేది తెలియాల్సి ఉంది.






