Minister Adluri : మా సామాజికవర్గంలో పుట్టడం తప్పా? : మంత్రి అడ్లూరి

తాను మాదిగ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని కాబట్టే మంత్రి పదవి వచ్చిందని తెలంగాణ రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ (Adluri Lakshman) అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తో విభేదాల నేపథ్యంలో ఆయన స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నేను మంత్రి కావడం, మా సామాజికవర్గంలో పుట్టడం తప్పా? అని ప్రశ్నించారు. పొన్నం మాదిరిగా అహంకారంగా మాట్లాడటం నాకు రాదు. ఆయన తన తప్పు తెలుసుకుంటారని అనుకున్నా. పొన్నం మారకపోతే జరిగే పరిణామాలకు ఆయనదే బాధ్యత. త్వరలో సోనియాగాంధీ (Sonia Gandhi,) , రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) , మీనాక్షి నటరాజన్‌ను కలుస్తా అని అన్నారు.