Bhatti Vikramarka: కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం : భట్టి

రాష్ట్రంలోని మహిళలను కోటీశ్వరులను చేసే విధంగా తమ ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతోందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జరిగిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భట్టి పాల్గొన్నారు. గ్రేటర్ (Greater) పరిధిలో స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను పంపిణీ చేశారు. అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఐదేళ్లలో కోటి మంది మహిళల (Womens)ను కోటీశ్వరులను చేయడం తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు. మహిళల కోసం ఉచిత బస్సు (Free bus) సౌకర్యం కల్పించాం. మహిళలను ఇప్పటికే 150 ఆర్టీసీ బస్సు (RTC bu) లకు యజమానులను చేశాం. మరో 450 బస్సులకు యాజమానులను చేయబోతున్నాం. మహిళలు ఇక వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు అని అన్నారు.