America: అమెరికాలో పాలమూరు యువకుడు మృతి

అమెరికాలో మహబూబ్‌నగర్ జిల్లా యువకుడు మహ్మద్ నిజాముద్దీన్ (Mohammed Nizamuddin) ఆమెర్ పోలీసు కాల్పుల్లో మృతి చెందిన ఘటన 15 రోజుల ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లా కేంద్రం రామయ్య బౌలికి చెందిన తండ్రి, విశ్రాంత ఉపాధ్యయుడు హసనుద్దీన్ ఈ ఘటనపై మాట్లాడుతూ నిజాముద్దీన్ 2016లో అమెరికా వెళ్లాడు. యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాలో ఎంఎస్ పూర్తి చేసి, కాలిఫోర్నియా (California)లోని ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. ఆరు నెలల కిందట ఉద్యోగ ఒప్పందం ముగియడంతో గడువు పొడిగించుకునే యత్నంలో ఉన్నాడు. ఇంతలోనే నిజాముద్దీన్ పోలీసుల కాల్పుల్లో చనిపోయినట్లు అతని స్నేహితులు మాకు ఫోన్ చేశారు. మృతిపై మాకు అనుమానాలున్నాయి. మృతదేహాన్ని భారత్ (India)కు తీసుకురావడానికి ప్రభుత్వం సాయం చేయాలి అని విన్నవించారు.