ఓపెన్ జైలు విధానం కూడా మంచి ఫలితాలు : గవర్నర్
తెలంగాణ పోలీసులు జైళ్లలో చేపట్టిన సంస్కరణలు బాగున్నాయని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా (Shivapratap Shukla) అభినందించారు. హైదరాబాద్ చంచల్గూడ జైలులో ముజియం (Museum:), ఫీల్ ది జైల్ (Feel the Jail) ప్రారంభోత్సవంలో గవర్నర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓపెన్ జైలు విధానం కూడా మంచి ఫలితాలు ఇస్తోందన్నారు. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) మంత్రిగా ఉన్నప్పుడు తాను కూడా కొన్ని సంస్కరణలు చేపట్టానని గుర్తు చేశారు. జైలు వచ్చిన ఖైదీల్లో పరివర్తన తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఖైదీలను పూర్తిగా బంధించి ఉంచాల్సిన అవసరం లేదని, ఆహ్లాదకర వాతావరణం ఉన్నప్పుడే వారిలో మార్పు తీసుకురాగలమన్నారు.
ఇవి కూడా చదవండి
