Revanth Reddy: సుప్రీం తీర్పు వచ్చే వరకూ వేచిచూస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్రపతి, గవర్నర్లు తమ ముందుకొచ్చిన బిల్లుపై 90 రోజుల్లోపు నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వుపై రాష్ట్రపతి స్పష్టత కోరిన నేపథ్యంలో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వచ్చే వరకూ స్థానిక ఎన్నికల నిర్వహణ విషయంలో వేచిచూస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడిరచారు. ఢల్లీిలోని అధికార నివాసంలో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే రెండు బిల్లులతోపాటు, రాష్ట్రంలో రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని తొలగిస్తూ పంపిన మరో బిల్లు ప్రస్తుతం రాష్ట్రపతివద్ద పెండిరగ్‌లో ఉన్నాయని గుర్తు చేశారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల విషయంలో తాము సుప్రీంకోర్టు (Supreme Court) రాజ్యాంగ ధర్మాసనం తీర్పును బట్టి తదుపరి కార్యాచరణ చేపడతామన్నారు. ఈ క్రమంలో ఈ నెల 30లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు (High Court) ఉత్తర్వులపై ఏం చేయాలన్న విషయంపై న్యాయనిపుణులతో సంప్రదించి తగు విధంగా స్పందిస్తామన్నారు. అవవసరమైతే హైకోర్టుకు ఇప్పుడున్న పరిస్థితులు వివరించి మరింత గడువు కోరతామని వెల్లడిరచారు.