Bathukamma: వెయ్యి స్తంభాల గుడిలో బతుకమ్మ వేడుకలు : మంత్రి జూపల్లి కృష్ణారావు

బతుకమ్మ వేడుకల్లో రాజకీయాలకు అతీతంగా ప్రతిఒక్కరూ పాల్గొని తెలంగాణ సంప్రదాయాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్‌శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) కోరారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud), మాజీ అధ్యక్షుడు వీహెచ్, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ సుజాత కలిసి గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 21 నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ (Bathukamma) వేడుకలు నిర్వహిస్తాం. 21న హనుమకొండ (Hanumakonda) వెయ్యి స్తంభాల గుడి వద్ద ప్రారంభించి, 22 నుంచి 30 వరకు రోజుకు 2 జిల్లాల్లో జరుపుతాం. 27 నుంచి 30 వరకు హైదరాబాద్‌లో జరపడానికి ఏర్పాట్లు చేశాం. 28న ఎల్‌బీ స్టేడియంలో 63 అడుగుల బతుకమ్మతో, 10 వేల మందితో పెద్దఎత్తున నిర్వహిస్తాం. గిన్నిస్‌బుక్ (Guinness Book) లో చేరేలా జరపాలని నిర్ణయించాం అని జూపల్లి తెలిపారు.