ఎన్ఆర్ఐలకు మాత్రమే ఎందుకు అవకాశం
పాత పెద్ద నోట్ల డిపాజిట్లపై దాఖలైన పిటిషన్ను ఈ రోజు సుప్రీంకోర్టు విచారించింది. కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) లకు కోర్టు నోటీసులు జారీ చేసింది. ఎన్ఆర్ఐలకు మాత్రమే ఎందుకు అవకాశం ఇచ్చారు. మార్చి 31 వరకు అందరికీ ఎందుకు అవకాశం ఇవ్వలేదని ప్రశ్నించింది. రెండు వారాల్లో దీనికి సంబంధించిన వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను కోర్టు ఏప్రిల్ 11కు వాయిదా వేసింది.
