దుబాయ్ ప్రయాణికులకు వీసా సర్వీసులు
తమ విమానాల్లో దుబాయ్‌కి వెళ్లాలనుకునే భారతీయులకు వీసా సర్వీసులు అందించనున్నట్టు స్పైస్‌జెట్ తెలిపింది. స్పైస్‌జెట్ విమానాల్లో దుబాయ్‌కి రానుపోను టికెట్లు కలిగిన వారు వీసా సర్వీసును పొందవచ్చని పేర్కొంది. 14 రోజులు, 30 రోజుల కాలపరిమితితో పర్యాటక వీసాలు అందుబాటులో ఉన్నట్టు తెలిపింది. 5,412 రూపాయల ప్రారంభ ధరతో ఒక్కో ప్రయాణికునికి వీసా అందించనున్నట్లు పేర్కొంది.
