ఇన్‌స్టాగ్రామ్‌లోనూ మోడీ నెంబర్ వన్
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రపంచంలోనే అత్యంత ఆదరణ కలిగిన నేతగా నిలిచారు. ఈ విషయంలో ఆయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నూ అధిగమించారు. ఫొటో షేరింగ్ యాప్ అయిన ఇన్స్టాగ్రామ్ గత ఏడాదిగా ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల, ప్రభుత్వాధినేతలు, విదేశాంగ మంత్రులకు చెందిన 325 ఇన్స్టాగ్రామ్ ఖాతాలను పరిశీలించి ఈ విషయాన్ని ప్రకటించింది. ఇన్స్టాగ్రామ్ వేదికగా మోడీ 101 పోస్టులకు పెట్టారు. వీటిపై వచ్చిన కామెంట్లు, లైక్‌ల ఆధారంగా ఆ సామాజిక మాధ్యమంలో ఆయనను 69 లక్షల మంది అనుసరిస్తున్నారని తేల్చింది. 63 లక్షల మందితో ద్వితీయ స్థానంలో ట్రంప్, 37 లక్షల మంది అనుసరణతో పోప్ ఫ్రాన్సిస్ తృతీయ స్థానంలో ఉన్నారు. 34 లక్షల మంది అనుసరణలతో శ్వేత సౌథం నాలుగులో స్థానంలో నిలిచింది.
