జూన్‌లో మోడీ అమెరికా పర్యటన?
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ త్వరలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశమవబోతున్నారు. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు హెచ్ఆర్ మెక్‌మాస్టర్ ప్రధాని మోడీతో జరిపిన చర్చల్లో మోడీ అమెరికా పర్యటన గురించి ప్రస్తావన వచ్చినట్లు సమాచారం. బహుశా జూన్‌లో మోడీ అమెరికా పర్యటన ఉండేలా ఇరు దేశాల అధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబరులో ఐక్యరాజ్య సమితి సాధారణ సభ సమావేశాలకు ముందుగానే ట్రంప్ -మోడీ సమావేశం జరిగేలా తేదీలను ఖరారు చేసేందుకు కృషి జరుగుతోంది. మోడీ అధికారాన్ని చేపట్టిన తర్వాత మూడేళ్ళలో నాలుగుసార్లు అమెరికాలో పర్యటించారు. ఈసారి ఆయన అమెరికా పర్యటిస్తే డొనాల్డ్ ట్రంప్ దేశాధ్యక్ష బాధ్యతలను చేపట్టిన తర్వాత మోదటిసారి పర్యటించినట్లవుతుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం వచ్చే జూన్ లేదా జూలైలో మోడీ -ట్రంప్ ద్వైపాక్షిక చర్చలు జరగవచ్చు. మరోవైపు జర్మనీలోని హాంబర్గ్‌లో సెప్టెంబరులో జరిగే జీ-20 సమావేశం నేపథ్యంలో మోడీ, ట్రంప్ కలిసే అవకాశం ఉంది.
