త్వరలో కొత్త రూ.10 నోట్లు
రిజర్వు బ్యాంకు త్వరలో కొత్త రూ.10 నోట్లను విడుదల చేయనుంది. మహాత్మాగాంధీ సీరిస్-2005లో భాగంగా వీటిని ముద్రించింది. రిజర్వు బ్యాంకు గవర్నర్ ఊర్జిత్ ఆర్ పటేల్ సంతకంతో ఈ నోట్లు ఉంటాయి. ముద్రణ సంవత్సరాన్ని 2017గా పేర్కొంది. నోటును ఎత్తి పట్టి పరీక్షగా చూస్తే నెంబర్ల వద్ద ఎల్ అనే ఆంగ్ల అక్షరం అంతర్లీనంగా కనిపిస్తుంది. కొత్త నోట్లు వచ్చినప్పటికీ పాతవి కూడ చెల్లుబాటు అవుతాయి. ఈ మేరకు రిజర్వు బ్యాంకు అధికారిక ప్రకటన వెలువరించింది.
