పాక్ ప్రధానితో మోడీ భేటీ?
భారత ప్రధాని నరేంద్ర మోడీ, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌లు త్వరలో సమావేశం అయ్యే అవకాశం ఉంది. కుల్‌భూషణ్ జాదవ్‌కు పాకిస్తాన్ సైనిక కోర్టు మరణశిక్ష విధించినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రికత్తలు తీవ్రస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో ఇరు దేశాల ప్రధానుల మధ్య భేటీ ఎలా సాధ్యమన్న అనుమానాలున్నా, జూన్ నెలలో జరగనున్న షాంఘై సహకార సమితి (ఎస్సీఓ) సమావేశాల సందర్బంగా, వీరిద్దరు భేటీ అయ్యే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఈ సమావేశం కజికిస్థాన్లోని అస్తానాలో జరగనుంది.
