YS Sharmila : ఇది తెలుగు ప్రజలకు చేసిన ద్రోహం.. కాకపోతే మరేంటో : వైఎస్ షర్మిల

వైసీపీ ముసుగు మళ్లీ తొలగిందని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. బీజేపీ (BJP ) కి వైసీపీ బీ టీమ్ అని నిజ నిర్ధరణ జరిగిందన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికి మద్దతుతో మరోసారి తేటతెల్లమైందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షం ముసుగులో ఉన్నది మోదీ (Modi) పక్షమేనని తేలింది. అవినీతి కేసులకు భయపడి బీజేపీకి వైసీపీ (YCP) మళ్లీ దాసోహం అంటోంది. ఓటు చోరీతో రాజ్యాంగం ఖూనీ అయ్యేది వైసీపీకి కనిపించదు. ఓ తెలుగు బిడ్డ, న్యాయ నిపుణుడిని ఉపరాష్ట్రపతి (Vice President) అభ్యర్థిగా నిలబెడితే మద్దతు ఇవ్వలేరా? ఇది తెలుగు ప్రజలకు చేసిన ద్రోహం కాకపోతే మరేంటో వైసీపీ చెప్పాలి అని ప్రశ్నించారు.