Samantha: గతంలో ఎప్పుడూ చేయని జానర్లో సమంత
సమంత(samantha) కొన్నాళ్లుగా ఎవరూ ఊహించని డెసిషన్స్ తీసుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తూ వస్తుంది. పుష్ప(Pushpa) సినిమాలో ఐటెం సాంగ్ చేసి ఆశ్చర్యపరిచిన సామ్, ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల సినిమాల నుంచి బ్రేక్ తీసుకుని షాకిచ్చింది. ఆ తర్వాత సినిమాల్లోకి కంబ్యాక్ ఇచ్చాక బాలీవుడ్ పై ఎక్కువ ఫోకస్ చేసిన సమంత ఇప్పుడు మరోసారి తన డెసిషన్ తో ఆశ్చర్యపరచనున్నట్టు తెలుస్తోంది.
సమంత ప్రధాన పాత్రలో చేస్తున్న మా ఇంటి బంగారం(maa inti bangaram) సినిమాను అమ్మడు ఇప్పుడు సోషియో ఫాంటసీ జానర్ లో చేస్తుందని సమాచారం. కంబ్యాక్ తర్వాత సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్న సమంత, మా ఇంటి బంగారంతో కొత్తగా ఏం ప్లాన్ చేస్తుందో తెలుసుకోవడానికి ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైటింగ్ గా ఉన్నారు. సమంత లీడ్ లో వచ్చిన ఓ బేబీ(Oh baby)కి దర్శకత్వం వహించిన నందినీ రెడ్డి(nandini reddy) మా ఇంటి బంగారం మూవీకి దర్శకత్వం వహిస్తుండగా, ఈ మూవీ కూడా ఫీమేల్ సెంట్రిక్ మూవీగానే రాబోతుంది.
టాలీవుడ్ లో ఈ మధ్య హనుమాన్(hanuman), కార్తికేయ2(Karthikeya2), మిరాయ్(miraai) లాంటి మూవీస్ ఎక్కువగా వస్తుండటంతో సమంత కూడా మా ఇంటి బంగారంతో ఆ క్లబ్ లో చేరాలని, ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా మార్చాలని ప్లాన్ చేస్తుందని, ఆ ప్లాన్ లో భాగంగానే సామ్ ఓ బాలీవుడ్ కార్పోరేట్ సంస్థతో డీల్ కోసం చర్చలు కూడా జరుపుతుందని సమాచారం. చూస్తుంటే సమంత ఈ సినిమాను చాలా భారీ స్థాయిలోనే ప్లాన్ చేస్తున్నట్టు అనిపిస్తోంది.







