Pemmasani :వికసిత్ భారత్ లక్ష్య సాధనకు.. ఏపీ ముందు వరుసలో : కేంద్రమంత్రి పెమ్మసాని
వికసిత్ భారత్ లక్ష్య సాధనకు ఏపీ ముందు వరుసలో నిలుస్తోందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandrasekhar) అన్నారు. గుంటూరులో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వాటర్ షెడ్స్ (Water sheds) అభివృద్ధి పై సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి పెమ్మసాని హాజరై మాట్లాడారు. వర్షపు నీటి నిల్వ, భూగర్భ జలాలు పెంచడమే లక్ష్యమన్నారు. చాలా కారణాలతో నీటినిల్వ సామర్థ్యం రోజురోజుకూ తగ్గిపోతోందని తెలిపారు. వాటర్ షెడ్స్ అభివృద్ధి రెండు దశలతో మంచి ఫలితాలు వచ్చాయని చెప్పారు. మూడో దశ మరింత సమర్థంగా అమలు చేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు రెవెన్యూ(Revenue), జల వనరులు, వ్యవసాయ శాఖ (Agriculture Department)ల మధ్య సమన్వయం ముఖ్యమన్నారు. వాటర్ షెడ్స్ పనుల వల్ల దీర్ఘకాలికంగా ప్రయోజనాలు కలుగుతాయని వివరించారు.







