BR Naidu: అతన్ని తిరుపతి నుంచి తరిమికొట్టాలి : బీఆర్ నాయుడు
తిరుమల తిరుపతి దేవస్థానం ( టీటీడీ) పవిత్రతను కాపాడేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు (BR Naidu) తెలిపారు. ముంతాజ్ హోటల్ (Mumtaz Hotel) వ్యవహారంపై పద్మావతి అతిథిగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోట్లాది రూపాయల టీటీడీ నిధులు వైసీపీ నేతలు (YCP leaders) మింగేశారని ధ్వజమెత్తారు. ఏడు కొండలను ఆనుకొని ఉన్న ప్రాంతాన్ని ముంతాజ్ హోటల్‌కు కేటాయించడం వైసీపీ చేసిన తప్పు. పవిత్ర తిరుమలలో ముంతాజ్ హోటల్ నిర్మాణం సరికాదని చంద్రబాబు (Chandrababu) చెప్పారు. యాజమాన్యాన్ని ఒప్పించి మరోచోట 25 ఎకరాలు తీసుకునేందుకు చంద్రబాబు ఒప్పించారు. టీటీడీ భూములను ప్రైవేటు సంస్థలకు ఇస్తున్నారని దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ అంశంలో సీబీఐ విచారణ జరిపించాలని వైసీపీ నేతలు అడగటం హాస్యాస్పదం. వైసీపీ నేతలు డబ్బు వెదజల్లి అందరినీ కొనేందుకు అలవాటుపడ్డారు. మేం బోర్డులోకి వచ్చాక అవినీతికి అస్కారం లేకుండా పనిచేస్తున్నాం. ముంతాజ్ హోటల్‌కు భూములు ఇచ్చేందుకు అజయ్ అనే వ్యక్తిని బెదిరించారు. సాక్షాత్తూ జగన్ అజయ్‌కు పాయింట్ బ్లాంక్ రేంజ్ లో తుపాకి పెట్టి బెదిరించారు. తిరుపతిలో నివసించేందుకు భూమన కరుణాకర్‌రెడ్డి(Bhumana Karunakar Reddy) అనర్హుడు. అతన్ని తిరుపతి నుంచి తరిమికొట్టాలి అని బీఆర్ నాయుడు అన్నారు.







