Pemmasani: హద్దు దాటొద్దు జగన్, ఒక్క మాటతో చంపేయగలను..!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు సెగలు పుట్టిస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan) తీరుపై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గుంటూరులో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, జగన్కు మునుపెన్నడూ లేని విధంగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సిఎం చంద్రబాబుపై(Chandrababu) జగన్ చేస్తున్న వ్యక్తిగత విమర్శలపై పెమ్మసాని నిప్పులు చెరిగారు. చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
మాకు సంస్కారం ఉందనే ఆగుతున్నాం. బాడీ షేమింగ్ గురించి, వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడటం మొదలుపెడితే.. నిన్ను ఒక్క మాటతో చంపేయగలను. కానీ, మా విలువలు, పెరిగిన పద్ధతి మమ్మల్ని అడ్డుకుంటున్నాయి అంటూ పెమ్మసాని హెచ్చరించారు. వ్యక్తిగత దూషణలకు దిగడం జగన్ నైజమని విమర్శించిన పెమ్మసాని.. దమ్ముంటే రాజకీయంగా తమను ఎదుర్కోవాలని సవాలు విసిరారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతివిమర్శలు సహజం. కానీ హద్దులు దాటి మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి
సంస్కారం లేని రాజకీయాలకు స్వస్తి పలకాలని ఆయన హితవు పలికారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తే ఫలితం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు పెమ్మసాని. జగన్ తీరు మార్చుకోకపోతే తెలుగుదేశం శ్రేణులు తగిన బుద్ధి చెబుతాయని, కేంద్ర మంత్రిగా గౌరవప్రదమైన స్థానంలో ఉన్నా, పార్టీ ప్రయోజనాల కోసం దేనికైనా సిద్ధమని పెమ్మసాని స్పష్టం చేశారు. నువ్వు చేసిన తప్పుల వల్లే ప్రజలు నిన్ను పక్కన పెట్టారు. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకో అంటూ హితవు పలికారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమన్నారు.
ఇవి కూడా చదవండి
