Pedda Reddy: వైఎస్‌ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి హైకోర్టులో షాక్

వైఎస్‌ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి (K. Pedda Reddy) ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డివిజన్ బెంచ్ చుక్కెదురైంది. తాడిపత్రికి వెళ్లేందుకు ఆయనకు భద్రత కల్పించాలని గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు పెద్దారెడ్డికి (K. Pedda Reddy) నోటీసులు కూడా పంపింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేందుకు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై అనంతపురం ఎస్పీ జగదీష్.. హైకోర్టు (High Court) డివిజన్ బెంచ్‌లో అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు. పెద్దారెడ్డి రాకతో తాడిపత్రిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని ఎస్పీ తరపు న్యాయవాది వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న డివిజన్ బెంచ్, సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది.