Davos: యాక్సెస్ హెల్త్ కేర్ సిఇఓ అనురాగ్ జైన్ తో మంత్రి లోకేష్ భేటీ
హెల్త్ కేర్, రియల్ ఎస్టేట్, ఎఐ స్టార్టప్ లలో పెట్టుబడులు పెట్టండి
దావోస్: యాక్సెస్ హెల్త్ కేర్ సిఇఓ అనురాగ్ జైన్(Access Healthcare CEO Anurag Jain) తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మ,త్రి నారా లోకేష్( Nara Lokesh) దావోస్ బెల్వేడేర్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ…. ఎపిలో ఆపరేషనల్ ఎఫిషియెన్సీ, పేషెంట్ ఫలితాలను మెరుగుపరచడానికి ప్రాసెస్ ఆటోమేషన్ సొల్యూషన్లను అమలు చేయడానికి ఎపి ప్రభుత్వంతో కలసి పనిచేయండి. ఆంధ్రప్రదేశ్‌లో హెల్త్‌కేర్, AI, రోబోటిక్స్ స్టార్టప్‌లలో పెట్టుబడి పెట్టండి. రాష్ట్రంలో క్రికెట్, ఇతర స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అభివృద్ధి చేయడానికి, ముఖ్యంగా యువత ప్రోత్సాహానికి మీ అనుబంధ సంస్థ అనురాగ్ జైన్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించండి.
ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, రియల్ ఎస్టేట్ లో హిల్ వుడ్ తరహా పెట్టుబడులు పెట్టండి. ఇండస్ట్రియల్ పార్క్స్, ప్లగ్-ఎన్-ప్లే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ) ఐటి పార్క్స్ REIT మోడల్ ద్వారా ఇండస్ట్రియల్ క్లస్టర్లలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయండి. పురోగతిలో ఉన్న మచిలీపట్నం ఓడరేవులో కంటైనర్ టెర్మినల్‌గా అభివృద్ధి చేయండి. మచిలీపట్నం ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలో (చెన్నై, వైజాగ్ ఓడరేవుల మధ్య) వ్యూహాత్మక కేంద్రంగా ఉంది, ఇది దేశీయ, అంతర్జాతీయ వాణిజ్య మార్గాలకు సులభంగా యాక్సెస్‌ను అందిస్తుంది. విజయవాడ, హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు వంటి ప్రధాన ఆర్థిక కేంద్రాలకు దగ్గరగా సాఫీగా కార్గో తరలింపును నిర్ధారిస్తుంది.
వ్యవసాయ, ఆక్వాకల్చర్ జోన్ల కుదగ్గరగా ఉండి, బియ్యం, పండ్లు, చేపల కంటైనర్ ఎగుమతులకు అనువైనదని మంత్రి లోకేష్ చెప్పారు.
అనురాగ్ జైన్ మాట్లాడుతూ… తమ సంస్థ ఎఐ, రోబోటిక్స్, రియల్ ఎస్టేట్, మొబిలిటీ తదితర రంగాల్లో 50కిపైగా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్లు చెప్పారు. కరోనా సమయంలో అమెరికా, భారత్ లలో 6కోట్ల భోజనాన్ని అందజేశామని చెప్పారు. ఎపి ప్రభుత్వ ప్రతిపాదనలపై సహచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
