క్వాంటం శకంలోకి ఆంధ్రప్రదేశ్.. దేశంలోనే తొలి సెంటర్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు!
Quantum Testbeds: సాంకేతిక రంగంలో ఆంధ్రప్రదేశ్ మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. దేశంలోనే మొట్టమొదటి ‘క్వాంటం ఫెసిలిటీ సెంటర్’ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఆవిష్కరించారు. అమరావతిలోని ఎస్ఆర్ఎం (SRM) యూనివర్సిటీ వేదికగా ఈ చారిత్రక కార్యక్రమం జరిగింది.
క్వాంటం టెస్ట్ రిఫరెన్స్ సదుపాయం:
గన్నవరంలోని మేధా టవర్స్ , ఎస్ఆర్ఎం వర్సిటీల్లో అత్యాధునిక సాంకేతికతతో ఏర్పాటు చేసిన 1S, 1Q క్వాంటం టెస్ట్బెడ్స్ను సీఎం జాతికి అంకితం చేశారు. ఈ ప్రారంభోత్సవంతో క్వాంటం టెస్ట్ రిఫరెన్స్ సదుపాయం కలిగిన దేశంలోనే తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టించింది.
ప్రముఖుల సమక్షంలో:
టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (TIFR) సహకారంతో ఈ ప్రాజెక్టును రూపొందించారు. ఈ కార్యక్రమంలో నేషనల్ క్వాంటం మిషన్ సభ్యులు, ఐఐటీ ప్రొఫెసర్లు, ప్రముఖ శాస్త్రవేత్తలు , క్వాంటం ఇన్నోవేషన్ స్టార్టప్ ప్రతినిధులు పాల్గొన్నారు.
విద్యార్థులు వీక్షించేలా:
ఈ అద్భుత ఘట్టాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలల విద్యార్థులు వీక్షించేలా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సుమారు 1.5 లక్షల మంది విద్యార్థులు వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమాన్ని వీక్షించి, క్వాంటం టెక్నాలజీ ప్రాధాన్యతను తెలుసుకున్నారు.
ఈ ఫెసిలిటీ అందుబాటులోకి రావడం వల్ల రాష్ట్రంలో పరిశోధనలు, స్టార్టప్‌లు , సరికొత్త ఆవిష్కరణలకు మార్గం సుగమం కానుంది.
ఇవి కూడా చదవండి
