వారి త్యాగాలకు, భక్తికి ఇది నిదర్శనం : సీఎం చంద్రబాబు
సోమనాథ్ అమృత్ మహోత్సం సందర్భంగా భక్తులందరికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీ (Delhi)పర్యటనలో ఉన్న చంద్రబాబు సోమనాథ్ ఆలయ (Somnath Temple) పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా చంద్రబాబు స్పందించారు. మన దేశం విశ్వాసాలను గౌరవించే భూమి. ఈ విశ్వాసం మనందరినీ ఏకం చేసే గొప్ప శక్తిగా నిలుస్తుంది. సోమనాథ్ ఆలయం భారతదేశ నాగరికత (Indian Civilization), ఆత్మగౌరవానికి శాశ్వత చిహ్నం. ఆలయ పునర్నిర్మాణానికి అంకితమైన వారి త్యాగాలకు, భక్తికి ఇది నిదర్శనం అని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
