వారణాసిలో మోదీ ఘన విజయం
సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి విజయం సాధించారు. సమీప ఎస్పీ అభ్యర్థి షాలిని యాదవ్పై 4 లక్షలకు పైగా మెజార్టీతో మోదీ జయభేరీ మోగించారు. కాగా ఈనెల 26న మోదీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.
