కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ?
ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టనున్నట్లు సమాచారం. మంత్రివర్గంలో భారీ స్థాయిలోనే మార్పులు జరుగుతాయని తెలిసింది. ఇటీవలే కిడ్నీఆపరేషన్ చేయించుకున్న సుష్మా స్వరాజ్‌ను తమిళనాడు గవర్నర్‌గా నియమిస్తారని, ఆమె స్థానంలో విదేశాంగ మంత్రిగా రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజేకు అవకాశం కల్పిస్తారని ఢిల్లీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. రక్షణ శాఖను అరుణ్ జైట్లీకి అప్పగించి, ప్రస్తుత విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు ఆర్థిక శాఖ కేటాయిస్తారనితెలిసింది. ఇక యూపీ ముఖ్యమంత్రి పదివి బరిలో చివరిదాకా బరిలో నిలిచిన కేంద్ర సహాయ మంత్రి మనోజ్ సిన్హాకు ప్రమోషన్ దక్కనున్నట్లు, ఆయనను పూర్తిస్థాయి కేబినెట్‌మంత్రిగా నియమించనున్నట్లు సమాచారం.
