ట్రంప్ జోక్యం అవసరం లేదు
భారత్-పాక్ చర్చల విషయంలో డొనాల్డ్ ట్రంపేకాదు, ఏ ఇతర మూడో వ్యక్తి లేదా సంస్థల జోక్యాన్ని సహించబోమంటూ పరోక్షంగా నరేంద్ర మోదీప్రభుత్వం హెచ్చరించింది.
ఉగ్రవాదాన్ని నిర్మూలించడం, శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడం తదితర అంశాల్లో భాగంగా భారత్- పాకిస్థాన్ ల మధ్య నెలకొన్నవివాదాలను రెండు దేశాలే పరిష్కరించుకోవాలన్న విధానానికే కట్టుబడి ఉన్నామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ మంగళవారం ఒక ప్రకటనలోపేర్కొంది. తద్వారా మూడో వ్యక్తి ప్రమేయాన్ని మరోసారి నిర్ద్వంద్వంగా తిరస్కరించింది.
