పండ్లు, కూరగాయలతో హైబీపీని తగ్గించుకోవచ్చు!
పండ్లు, కూరగాయల్లోని పోటాషియం రక్తపోటును తగ్గిస్తుందని తాజా పరిశోధనలో వెల్లడైంది. కాఫీ కూడా బీపీని తగ్గిస్తుందని తేలింది. ఇటీవలి కాలంలో హైపర్ టెన్షన్ ప్రమాదకర రీతిలో పెరిగిపోతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఇది హృద్రోగ వ్యాధులకు, తద్వారా మరణానికి దారితీస్తోందని పేర్కొంది. ఏటా జరుగుతున్న మరణాలలో 51శాతం ఒక్క గుండెపోటు వల్లేనని వివరించింది. కూరగాయలు, పండ్లను తీసుకోవడం ద్వారా రక్తపోటును తగ్గించుకోవచ్చని యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా వెల్లడించింది.
