హైదరాబాద్ టూ అమెరికాకు నేరుగా విమానాలు!
హైదరాబాద్ నుంచి అమెరికాలోని న్యూయార్క్, డాలస్లకు నేరుగా విమానాలు నడిపే అంశాన్ని పరిశీలిస్తామని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు తెలిపారు. హైదరాబాద్ నుంచి న్యూయార్క్, డాలస్ నగరాలకు ఏటా లక్షలాది మంది ప్రయాణిస్తుంటారని లోక్‌సభలో టీఆర్ఎస్ ఎంపీ వినోద్‌కుమార్ కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఆయా నగరాలకు నేరుగా విమానాలు నడిపే అస్కారం ఉందా అని అడిగిన ప్రశ్నకు పౌరవిమానయాన మంత్రి అశోక్‌గజపతిరాజు పై విధంగా స్పందించారు.
