సమ్మర్ వొకేషన్ ఆఫర్ ప్రకటించిన ఇండిగో
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో తమ ప్రయాణికుల కోసం అద్భుత ఆఫర్లను ప్రకటించింది. నిన్న ప్రారంభమైన ఈ ఆఫర్ రేపటి వరకు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. సమ్మర్ వొకేషన్ ఆఫర్ పేరిట అన్ని ధరలు కలుపుకుని కేవలం రూ.999 కే విమాన టికెట్ అందించనున్నట్లు తెలిపింది. టికెట్లను బుక్ చేసుకున్న వారు ఈ ఏడాది మే నుంచి జూన్ 30 మధ్యలో ప్రయాణించవచ్చని పేర్కొంది. ఇండిగో ఎంపిక చేసిన ప్రాంతాలకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని వివరించింది. ఒకసారి టికెట్ బుక్ చేసుకున్న తర్వాత టికెట్ చార్జీలను తిరిగి చెల్లించబోమని, ముందు బుక్ చేసుకున్న వారికి ప్రాధాన్యం ఉంటుందని పేర్కొంది.
