విజయ్ అను నేను….. దళపతి ప్రమాణ స్వీకారం
తమిళనాడులో ఎట్టకేలకు కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరిగింది. విజయ్ తో రాష్ట్ర గవర్నర్ ఆర్లేకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఇతర రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. సినీ తార త్రిష ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విజయ్ తో పాటు తొమ్మిది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అందులో ఎన్. ఆనపంద్, ఆదవ అర్జున్, కె.ఎ. సెంగోటియన్, ఎస్. కీర్తన, కెజి. అరుణ్ రాజ్, పి. వెంకటరమణన్, సి.ఆర్. నిర్మల్ కుమార్, రాజ్ మోహన్, టి.కె. ప్రభు వున్నారు.
