యువ మంత్రి కీర్తన.. అంతా తెరవెనుక నుంచే..
ఇప్పుడు అందరి దృష్టి తమిళనాడు సీఎం విజయ్ పైనే వుంది. అలాగే మరో నేతపై కూడా వుంది.ఆమె పేరే ఎస్. కీర్తన. కేవలం 29 సంవత్సరాలు మాత్రమే. విజయ్ తో పాటు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.అసలు రాజకీయ కుటుంబ నేపథ్యం లేకున్నా.. మొదటి సారి రాకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. మొదటి సారే ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రి కూడా అయ్యారు.
విజయ్ కేబినెట్లో తొమ్మిది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో తెలుగు మహిళ ఎస్. కీర్తనా కూడా ఉన్నారు.కీర్తనది విరుద్‌నగర్ జిల్లాలోని చత్రరెడ్డియపట్టి. డిగ్రీ వరకు అక్కడే చదువుకున్నారు. తరువాత పాండిచ్చేరి యూనివర్శిటీలో ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్ పూర్తి చేశారు. ఆ తరువాత ప్రశాంత్ కిశోర్ బృందంలో పనిచేశారు. గోవా, పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో రాజకీయ వ్యూహకర్తగా పనిచేశారు. 2021 ఎన్నికల్లో తమిళనాడులో ఎం.కె. స్టాలిన్ కోసం కూడా కీర్తన పనిచేశారు. హైదరాబాద్‌లోని టీడీపీ సోషల్ మీడియా లీడ్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలోనే ఆమె తెలుగుపై మంచి పట్టు సాధించారు.
అయితే.. సోషల్ మీడియాలో గట్టి పట్టుంది. బాగానే ఫాలోయింగ్ కూడా వుంది. దీనిని చూసిన విజయ్.. వెంటనే శివకాశీ నుంచి బరిలోకి దిగాలని ఆదేశించారు. ఎన్నికలకు సరిగ్గా నెల ముందు శివకాశి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ టికెట్‌ను ఆమెకు ఇచ్చింది. కీర్తన తనదైన శైలిలో ప్రచారం చేసుకుంటూ ప్రజల్లోకి దూసుకెళ్లారు. పలుచోట్ల ప్రచార కార్యక్రమాల్లో తెలుగులో మాట్లాడి ఆయా వర్గాలను ఆకట్టుకున్నారు.
శివకాశి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి జి. అశోకన్‌పై సుమారు 11వేల ఓట్ల మెజార్టీతో కీర్తన విజయం సాధించారు. శివకాశిలో పోటీచేసి గెలిచిన తొలి మహిళా ఎమ్మెల్యే కూడా కీర్తన రికార్డు నెలకొల్పాడు.
టీవీకే ప్రారంభ రోజుల్లో కీర్తనను యువకులను ఆకర్షించడం కోసం, నియోజకవర్గాల ప్రణాళిలక కోసం, సోషల్ మీడియా కోసం విజయ్ బాధ్యతలు అప్పగించారు. దీంతో తెరవెనుక బాగా పనిచేశారు.ఎన్నికల్లో గెలిచినప్పటి నుండి, ఎస్. కీర్తన హిందీలో మాట్లాడి అందరి దృష్టిని ఆకర్షించారు. తన నాయకురాలి సందేశాన్ని ఎక్కువ మంది అర్థం చేసుకుని, దానితో మమేకం కావడానికి సహాయపడటానికే తాను ఆ భాషను ఎంచుకున్నానని ఆమె అన్నారు. గత కొన్నేళ్లుగా తమిళనాడులో హిందీకి రాజకీయ వ్యతిరేకత కొనసాగుతున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
