కోట్లు సంపాదించినా .. ఇలా చేయకపోతే మీ పిల్లలకు చిల్లిగవ్వ దక్కదు!
Estate Planning: కష్టపడి ఆస్తులు సంపాదించిన ప్రతి ఒక్కరూ తమ వారసుల భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటారు. అయితే, కేవలం సంపాదన ఉంటే సరిపోదని, దానికి పక్కా ‘ఎస్టేట్ ప్లానింగ్’ అవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన ఈ తరుణంలో, మన ఆర్థిక భద్రతను దెబ్బతీసే ఆరు ప్రధాన పొరపాట్ల గురించి తెలుసుకోవడం అత్యవసరం.
వీలునామా లేకపోవడం..
ఆస్తులు సంపాదించినా అవి మీ తర్వాత ఎవరికి చెందాలనేది స్పష్టంగా రాసి ఉంచకపోవడం పెద్ద తప్పు. వీలునామా లేదా ట్రస్ట్ లేకపోతే, మీ కష్టార్జితం కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఫలితంగా వారసులకు ఆస్తి దక్కడం కష్టమవుతుంది.
ఇవి కూడా చదవండి
భారీగా ఖర్చు చేయడం..
విలువ తగ్గే వస్తువులపై (లగ్జరీ కార్లు, బ్రాండెడ్ వస్తువులు) భారీగా ఖర్చు చేయడం వల్ల మీ పొదుపు కరిగిపోతుంది. సంపద పెరగాలంటే ఆస్తులను పెంచే వాటిపై పెట్టుబడి పెట్టాలి కానీ, అప్పు చేసి మరీ విలాసాలకు ప్రాధాన్యత ఇవ్వకూడదు.
క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్లు..
క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్ల వంటి అధిక వడ్డీ ఉండే అప్పుల ఊబిలో చిక్కుకోవడం ఆర్థిక విధ్వంసానికి దారితీస్తుంది. ఈ చక్రవడ్డీ మీ సంపాదనను నిశ్శబ్దంగా మింగేస్తుంది.
హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ రక్షణ కవచం ..
సరైన హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ లేకపోతే, ఏదైనా అత్యవసర ఆరోగ్య సమస్య తలెత్తినప్పుడు ఉన్న ఆస్తులను అమ్ముకోవాల్సి వస్తుంది. బీమా అనేది మీ ఆస్తులకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది.
ఒకే విభాగంలో పెట్టుబడులు..
డబ్బునంతటినీ కేవలం రియల్ ఎస్టేట్ లేదా బంగారం వంటి ఒకే విభాగంలో పెట్టడం ప్రమాదకరం. మార్కెట్ ఒడుదొడుకులను తట్టుకోవాలంటే స్టాక్స్, బాండ్స్, గోల్డ్ వంటి వివిధ రంగాల్లో పెట్టుబడులను విస్తరించాలి (Diversification).
ఆర్థిక బాధ్యతలు..
చాలామంది తమకున్న అప్పుల వివరాలను కుటుంబ సభ్యులకు చెప్పరు. మీ తర్వాత ఆ రహస్య అప్పులు పిల్లల మీద భారంగా మారి, వారి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తాయి. అందుకే ఆర్థిక బాధ్యతలపై కుటుంబంతో చర్చించడం అవసరం.
ఇవి కూడా చదవండి
