America : రష్యా-ఉక్రెయిన్ మధ్య ఒప్పందం.. అమెరికా

రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి దిశగా తొలి అడుగుపడిరది. నల్ల సముద్రం (Black Sea ) లో సురక్షిత నౌకాయానంపై రష్యా-ఉక్రెయిన్ మధ్య ఒప్పందం(Agreement) కుదిరిందని అమెరికా ప్రకటించింది. సౌదీ అరేబియా (Saudi Arabia) రాజధాని రియాద్‌లో ఆ రెండు దేశాలతో మూడురోజులుగా తమ మధ్యవర్తిత్వంలో నిర్వహించిన చర్చలు ముగిశాయని ట్రంప్ (Trump) సర్కారు తెలిపింది. ఇందుకు సంబంధించిన రెండు వేర్వేరు సంయుక్త ప్రకటనలను శ్వేతసౌధం విడుదల చేసింది. నల్లసముద్రంలో సురక్షితమైన వాణిజ్యకార్యక్రమాలు నిర్వహించుకునేందుకు, అక్కడ బలగాలను తొలగించేందుకు, వాణిజ్యనౌకలను సైనికావసరాలకు వినియోగించకుండా నిలువరించేందుకు ఇరుపక్షాలు ( రష్యా, ఉక్రెయిన్) అంగీకరించాయి అని తెలిపింది. ఒప్పందం పూర్తి వివరాలు బయటకురావాల్సి ఉంది.