Khalistani: భారత్ ఒత్తిడితో ఖలిస్తానీ ఉగ్రవాదిని అరెస్టు చేసిన కెనడా

భారత్ చేస్తున్న ఒత్తిడితో ఖలిస్తానీ (Khalistani) ఉగ్రవాదిని కెనడా ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది. ఖలిస్తానీ ఉగ్రవాది ఇందర్జిత్ సింగ్ గోసల్‌ను కెనడా పోలీసులు అరెస్టు చేశారు. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలతో ఒట్టావా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఖలిస్తానీ (Khalistani) సంస్థ ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ (SFJ) లో ఇందర్జిత్ కీలక సభ్యుడు. గతేడాది జూన్‌లో హర్దీప్ సింగ్ నిజ్జర్ మరణానంతరం, ఎప్ఎఫ్‌జే (SFJ) సంస్థ కార్యకలాపాలను గోసల్ పర్యవేక్షిస్తున్నాడు. అలాగే, ఖలిస్తానీ (Khalistani) నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌కు గోసల్ సహాయకుడిగా వ్యవహరిస్తున్నాడు. కేవలం ఒక సంవత్సరంలోనే ఇందర్జిత్ అరెస్టవడం ఇది రెండవసారి. గతేడాది నవంబర్‌లో టొరంటోలోని ఒక హిందూ దేవాలయం వద్ద హింసాత్మక ఘటనకు సంబంధించి అతడిని అరెస్టు చేసి, ఆ తర్వాత కొన్ని షరతులతో విడుదల చేశారు. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఒత్తిడితోనే కెనడా ప్రభుత్వం ఖలిస్తానీ (Khalistani) ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకుంటోందని తెలుస్తోంది. ఈ పరిణామం రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత ప్రభావం చేసే అవకాశం ఉంది.