Jaishankar: యూఎస్ విదేశాంగ మంత్రితో జైశంకర్ భేటీ

భారత విదేశాంగ మంత్రి జైశంకర్ (Jaishankar), అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో (Marco Rubio) సోమవారం సమావేశమయ్యారు. న్యూయార్క్‌లో జరుగుతున్న 80వ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల (UNGA) సందర్భంగా ఈ భేటీ జరిగింది. ఇటీవల హెచ్1బీ వీసా రుసుము పెంచడం, భారత్‌పై భారీ సుంకాల నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ చర్చల్లో ఇరు దేశాల మధ్య నెలకొన్న ద్వైపాక్షిక సంబంధాలు, ముఖ్యంగా వాణిజ్య ఒప్పందంపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి ముందు క్వాడ్ విదేశాంగ మంత్రుల భేటీలో కూడా జైశంకర్ (Jaishankar), రూబియో (Marco Rubio) పాల్గొన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు క్లిష్టంగా ఉన్నప్పటికీ, ఉన్నత స్థాయి చర్చలు కొనసాగుతున్నాయి. ఈ భేటీ రెండు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరచడానికి ఒక అవకాశంగా నిపుణులు భావిస్తున్నారు. ఈ చర్చల ద్వారా ఇరు దేశాల మధ్య ఉన్న సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయని ఆశిస్తున్నారు.