Ind vs Pak: చెత్త టీం, పాక్ ఫ్యాన్స్ ఫైర్..!

ఒకప్పుడు పాకిస్తాన్ క్రికెట్ టీమ్ అంటే భారీ అంచనాలు ఉండేవి. అలాంటి జట్టు భారత్(bharath) లాంటి దేశంపై.. మ్యాచ్ ఆడుతోంది అంటే అంచనాలు భారీగా ఉంటాయి. ముఖ్యంగా 2008 తర్వాత ఈ రెండు దేశాలు, మెగా టోర్నీలో మాత్రమే మ్యాచ్ లాడుతున్నాయి. దీనితో ఈ మ్యాచ్ లకు భారీ స్పందన వస్తోంది. ఇక పాకిస్తాన్(Pakistan) జట్టు భారత్ అనగానే కాస్త దూకుడుగా ప్రవర్తించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. దూకుడుగా ఆడటానికి జట్టు ఆటగాళ్ళు కూడా కష్టపడుతూ ఉంటారు. కానీ ఆసియా కప్ లో మాత్రం పాకిస్తాన్ ఘోరంగా ఫెయిల్ అయింది.
ఛాంపియన్ ట్రోఫీ తరహాలోనే ఈ రెండు మ్యాచ్ లలో కూడా అత్యంత పేలవంగా ఆడింది పాకిస్తాన్. దీనితో పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు ఆ తమ జట్టును ఒక రేంజ్ లో తిడుతున్నారు. ముఖ్యంగా ఆ జట్టు క్రికెట్ బోర్డు తీసుకుంటున్న నిర్ణయాలు, జట్టు భవిష్యత్తు, విజయ అవకాశాలపై ప్రభావం చూపిస్తున్నాయి. కీలక ఆటగాళ్లగా చెప్తున్న షాహిన్ ఆఫ్రిది, హారిస్ రవూఫ్, లాంటి ఆటగాళ్లు పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. కీలక మ్యాచ్ లలో వీళ్ళ ఆట తీరు అత్యంత దారుణంగా ఉంటుంది.
ఇద్దరు టీ20 లకు అసలు పనికిరారు అంటున్నారు పాకిస్తాన్ ఫ్యాన్స్. బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో కూడా తీవ్ర విమర్శలు ఉన్నాయి. ఆదివారం జరిగిన మ్యాచ్లో వికెట్లు ఉన్నా సరే పాకిస్తాన్ మాత్రం దూకుడుగా ఆడలేకపోయింది. దీనితో స్వల్ప స్కోర్ మాత్రమే చేయాల్సిన పరిస్థితి. కనీసం 220 స్కోర్ చేసే అవకాశం ఉన్నా సరే, పాకిస్తాన్ దూకుడుగా ఆడలేదు. ఇక బౌలింగ్ అయితే అత్యంత దారుణంగా ఉందని చెప్పాలి. కొత్త బంతితో ఏమాత్రం రాణించలేకపోతున్నాడు షాహిన్ అఫ్రిదీ.
సీనియర్ బౌలర్ గా జట్టులో కొనసాగుతున్న రవూఫ్ కూడా పెద్దగా రాణించడం లేదు. దీనితో వీళ్ళిద్దరిని టి20 జట్టు నుంచి పక్కన పెట్టాలని కోరుతున్నారు ఫ్యాన్స్. ఫీల్డింగ్ విషయంలో కూడా పాకిస్తాన్ ఒక ప్రణాళిక ప్రకారం ఆడటంలేదు అనే విమర్శలు వినపడుతున్నాయి. సాధారణంగా పాకిస్తాన్ ఫీల్డింగ్ అనగానే చాలామంది కామెడీగా చూస్తూ ఉంటారు. ఈ ఆసియా కప్ లో కూడా పాకిస్తాన్ అలాగే ఆడుతోంది. పాకిస్తాన్ కంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మెరుగ్గా రాణించింది ఈ టోర్నీలో.